వృద్ధుడిని ఈడ్చుకెళ్లి.. దాడి చేసి | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడిని ఈడ్చుకెళ్లి.. దాడి చేసి

Nov 13 2026 8:21 AM | Updated on Nov 13 2026 8:21 AM

పుట్టపర్తి టౌన్‌: నల్లమాడ మండలం మీసాలవాండ్లపల్లికి చెందిన వృద్ధుడిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిలోమీటర్‌ దూరం ఈడ్చుకెళ్లి దాడి చేసిన ఘటనపై యాదవ సంఘం నాయకులు ఎస్పీ సతీష్‌కుమార్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం ఆవరణలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప ఆధ్వర్యంలో బాధితుడితో కలసి నాయకులు మాట్లాడారు. మీసాలవాండ్లపల్లికి చెందిన కృష్ణప్ప గత శనివారం తన బావమరిది పొలం నుంచి టమాట తీగలకు కట్టడానికి ఐదు కట్టెలు తెస్తుండగా అదే గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి తన పొలం నుంచే కట్టెలు దొంగతనం చేస్తున్నావా? అంటూ మెడపట్టుకొని దాదాపు కిలోమీటర్‌ దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లాడన్నారు. అంతటితో ఆగకుండా పిడిగుద్దులు గుద్డాడు. వృద్ధుడు చనిపోతాడు.. వదిలేయండి అని గ్రామస్తులు బతిమలాడిన వినకుండా ఈడ్చుకెళ్లి ఆటోలో పడేసి నిర్బంధించాడన్నారు. భార్య రమాదేవిని అసభ్యపదజాలంతో దూషించి నెట్టేశాడన్నారు. బాధిత వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడని, పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించారన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్‌ స్పందించి విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యరద్శి ఉమాపతి యాదవ్‌, శ్రీరాములు యాదవ్‌, పురుషోత్తం యాదవ్‌, నరసింహయాదవ్‌, రాజశేఖర్‌యాదవ్‌, ఆనంద్‌ యాదవ్‌, శివకుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీకి ఫిర్యాదు చేసిన

యాదవ సంఘం నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement