ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలు

Nov 2 2026 2:11 AM | Updated on Nov 2 2026 2:11 AM

రొద్దం: ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు, అన్యాయాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్‌ విమర్శించారు. ఆదివారం పెనుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్షనేతలను అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజల మద్దతుతో వైఎస్సార్‌సీపీ ముందుకు సాగుతుంటే టీడీపీ నాయకులు భయంతో అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, ప్రతిపక్షనేతను అడ్డుకోవడం వారి అరాచకాలకు నిదర్శనమన్నారు.

జగన్‌ను విమర్శించే స్థాయా నీది?

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కప్పిపుచ్చాలనుకుంటే ప్రజలు ఎవరు నమ్మరని, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ని విమర్శించే స్థాయి మంత్రి సవితకు లేదన్నారు. ఓటమి భయంతో గోరంట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు సంబంధించి నామినేషన్‌ పత్రాలను నీ అనుచరుడు సుబ్బారెడ్డి ఆర్‌ఓ చేతిలో నుంచి తీసుకొని చింపేసిన దృశ్యాలను అందరూ చూశారని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో గెలవలేక కూటమి నాయకులు ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement