అమిలినేని ఇలాకాలోనూ దొంగ ఓట్లు | - | Sakshi
Sakshi News home page

అమిలినేని ఇలాకాలోనూ దొంగ ఓట్లు

Nov 2 2026 2:11 AM | Updated on Nov 2 2026 2:11 AM

కళ్యాణదుర్గం: మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీడీపీ ఓటమి భయంతో అడ్డదారులు తొక్కింది. అభ్యర్థులను గెలిపించుకునేందుకు రిగ్గింగ్‌కు పాల్పడింది. కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీకి పట్టు ఉన్న వార్డుల్లో ఓసారి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మరోసారి ఆయన తనయుడు యశ్వంత్‌, ఇంకోసారి వ్యక్తిగత కార్యదర్శి రాకేష్‌, టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గోళ్ల వెంకటేశులు, టీడీపీ నాయకులు డిష్‌ మురళి, అబ్దుల్‌ రహీం, ప్రకాష్‌తో పాటు పలువురు టీంలుగా ఏర్పడి దొంగ ఓట్లు వేయించేందుకు యత్నించారు. దొడగట్టలోని ఒకటి, రెండు వార్డుల్లో ఎమ్మెల్యే చాటున 40 మంది పార్టీ శ్రేణులో పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి రిగ్గింగ్‌ చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement