అభివృద్ధి చేసుంటే భయమెందుకు? | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేసుంటే భయమెందుకు?

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

సోమందేపల్లి(పరిగి): చంద్రబాబు నాయకత్వంలోని రెండున్నరేళ్ల కూటమిపాలనలో నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడేందుకు ఎందుకు భయపడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ ప్రశ్నించారు. సోమవారం సోమందేపల్లి మండలంలోని ఈదులబలాపురంలో పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జెడ్పీటీసీ అభ్యర్థి రామక్క, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ.... స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఓటమి భయంతో దాడులు, దౌర్జన్యాలు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను సైతం చించేస్తున్నారని, వీరి దుర్మార్గాన్ని దేశమంతా గమనిస్తోందన్నారు.

హామీలు ఏమయ్యాయి?

గతంలో చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలన్నీ నీటి మూటలయ్యాయని ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌, నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1,500, వలంటీర్ల వ్యవస్థ కొనసాగించడం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కనీసం సూపర్‌ సిక్స్‌ హామీలను సైతం నెరవేర్చకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవిత బీసీల కోసం ఏంచేసిందో చెప్పాలని ఉషశ్రీచరణ్‌ డిమాండ్‌ చేశారు. పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. గతంలో బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని సీఎం చంద్రబాబును ప్రశ్నించే దమ్ము నీకు లేదా? అంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధి పేరుతో ఇసుక, మట్టి, కంకర అక్రమ రవాణా చేస్తూ ప్రజాధనాన్ని కూటమి నేతలు దోచుకుంటున్నారన్నారు. నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించే లక్ష్యంతో పెనుకొండలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్‌ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుడితే...దాన్ని ఆపిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని ఉషశ్రీచరణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని తప్పక బుద్ధి చెప్పితీరుతారన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నేత చరణ్‌రెడ్డి, మండల కన్వీనర్‌ గజేంద్ర, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డీసీ అశోక్‌, మాజీ సర్పంచ్‌ నాగభూషణరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి గోవిందమ్మగారి శ్రీనివాసులు, లక్ష్మీనరసప్ప, క్రిష్టప్ప, ఆదినారాయణరెడ్డి, వేణు, ఆంజనేయులునాయక్‌, కంబాలప్ప మండ్లి రామాంజి, మాజీ సర్పంచ్‌ రామాంజనేయులు, లాయర్‌ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

మీ అభివృద్ధిపై నమ్మకముంటే

ఎన్నికల్లో తలపడండి

ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి గెలవండి

నామినేషన్‌ పత్రాలను చింపేయడం ప్రజాస్వామ్య విరుద్ధం

విలేకరుల సమావేశంలో

మాజీ మంత్రి ఉషశ్రీచరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement