పుట్టపర్తి అర్బన్: గ్రామీణ రైతులకు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ బాలాజీ నాయక్ పేర్కొన్నారు. సోమవారం కొత్తచెరువు మండలం తిరుమలదేవరపల్లి, కొడపగానిపల్లి గ్రామాల్లో వ్యవసాయ కళాశాల విద్యార్థులతో కలిసి రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కళాశాలల్లో ఉన్నత విద్యను పూర్తి చేసి క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధ్యయనం కోసం వచ్చిన విద్యార్థులు రైతులతో కలిసి మెళకువలు నేర్చుకోవాలన్నారు. చదువు లేని ఎంతో మంది రైతులకు సాంకేతిక పరిజ్ఙానాన్ని అందించి వ్యవసాయంలో అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ సతీష్ , వీఏఏ ఫిరోజ్, జేసీ దివాకర్‌రెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
హెచ్‌పీవీ వ్యాక్సిన్
వందశాతం పూర్తి చేయాలి
నల్లచెరువు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రిలోని పలు రికార్డులను, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. మండలంలోని గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గ్రామాల్లో నిర్వహించే హెల్త్ క్యాంపులకు తప్పని సరిగా డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే హెచ్‌పీవీ వ్యాక్సిన్ వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంతో వైద్యాధికారులు డాక్టర్ అలేఖ్య, కల్పన, సీహెచ్‌ఓ రామచంద్రారెడ్డి సూపర్‌వైజర్లు సుధాకర్, రెడ్డెమ్మ, హెల్త్ అసిస్టెంట్లు సూర్యనారాయణరెడ్డి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై కేసు నమోదు
అనంతపురం సెంట్రల్: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పోలీసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు త్రిలోక్‌నాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, నాయకులు లక్ష్మినారాయణ, శివకుమార్, ఆనంద్ ఆ సంఘం కార్యాలయంలో ఖండించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు.
దక్షిణ భారత
టీటీ పోటీలకు ఆరుష్
అనంతపురం సిటీ: విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో ఈ నెల 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జరిగే దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల టేబుల్ టెన్నిస్ పోటీలకు అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థి యూ.ఎస్. ఆరుష్ శ్రీవత్స ఎంపికయ్యాడు. డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తరఫున ప్రథమ స్థానంలో ఎంపికై న ఆరుష్.. దక్షిణ భారత టేబుల్ టెన్నిస్ పోటీల్లో కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయశ్రీ సోమవారం తన చాంబర్‌లో ఆరుష్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ నరసింహ నాయక్, ఆరుష్ తండ్రి, ప్రముఖ న్యాయవాది యు.ఎస్. మధుసూదన శర్మ, స్పోర్ట్స్ కమిటీ సభ్యుడు డా. పునర్జీవన్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. సునీల్, డా.బి.ఆంజనేయబాబు నాయక్ పాల్గొన్నారు.
జీబీసీకి నీరు బంద్
విడపనకల్లు: గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కు (జీబీసీ) సోమవారం సాగునీరు బంద్ చేశారు. జీబీసీకి నవంబర్ పదో తేదీ వరకు నీరు వదలాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా రిజర్వాయర్‌లో నీరు తగ్గుముఖం పడుతోంది. ఇదే క్రమంలో తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో నీరు వృథా కాకూడదనే ఉద్దేశంతో జీబీసీకి నీరు బంద్ చేసినట్లు డీఈ మంజునాథ్ తెలిపారు. వర్షాలు కురవకపోతే రెండు రోజుల్లో నీటి విడుదలను పునరుద్ధరిస్తామని చెప్పారు.


