ఎన్నికల కోడ్‌ అమలు గాలికి! | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ అమలు గాలికి!

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

పుట్టపర్తి అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి కోడ్‌ అమల్లోకి వచ్చినా జిల్లా కేంద్రం పుట్టపర్తిలో మాత్రం దాని అమలును గాలికొదిలేశారు. నిత్యం కలెక్టర్‌, ఎస్పీ, ఆర్డీఓలు ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నా ప్రచార కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు చెందిన పోస్టర్లు మాత్రం ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. కేవలం వైఎస్సార్‌సీపీకి చెందిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, చిత్రాలను తొలగించి కూటమి పార్టీలకు చెందిన ఏ ఒక్కటీ తొలగించడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని ఇటీవల స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు, జిల్లా అధికారులు కలిసి పలు చోట్ల ప్రారంభోత్సవాలు చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. అందులో ఫొటోలు, పార్టీ లోగోలు వేసుకున్నారు. కోడ్‌ వచ్చి దాదాపుగా రెండు వారాలవుతున్నా నేటికీ వాటిని తొలగించడం గానీ, ముసుగులు వేయడం కానీ చేయలేదు. పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల పోస్టర్లు, ఫ్లెక్సీలు ఇప్పటికీ అలాగే వదిలేయడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement