జగనన్నకు రుణపడి ఉంటా | - | Sakshi
Sakshi News home page

జగనన్నకు రుణపడి ఉంటా

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

● కదిరి మండల జెడ్పీటీసీ అభ్యర్థి

వజ్ర భాస్కర్‌రెడ్డి

కదిరి టౌన్‌: వైఎస్సార్‌సీపీ తరఫున జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్య నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి కదిరి మండల జెడ్పీటీసీ అభ్యర్థి వజ్ర భాస్కర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జగనన్నకు రుణపడి ఉంటానని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌, సమన్వయకర్తలు బీఎస్‌ మక్బూల్‌, టీఎన్‌ దీపిక, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఈరలక్కప్పకు ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఓపెన్‌ హౌస్‌ ఎగ్జిబిషన్‌

పుట్టపర్తి అర్బన్‌: పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, సాంకేతిక సాధనాలు, పోలీస్‌ బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఓపెన్‌ హౌస్‌ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసి పోలీసులు ఉపయోగించే అన్ని రకాల ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్‌ 21 నుంచి 31వ తేదీ వరకూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. పోలీసులు వాడే ఆయుధాల పనితీరు, వివిధ టీంలు ఏ సమయంలో ఏవిధంగా ఉపయోగపడతారో, నేరాలపై అప్రమత్తంగా ఎలా ఉండాలో, నేరస్తులను ఎలా గుర్తించాలో వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ఉమామహేశ్వరరెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, వీరన్న, ప్రదీప్‌ సింగ్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

31న రోల్‌ ప్లే,

జానపద నృత్య పోటీలు

పుట్టపర్తి: త్వరలో జరగనున్న జాతీయస్థాయి రోల్‌ ప్లే, జానపద నృత్య పోటీలకు సిద్ధం కావాలని డైట్‌ విద్యార్థులకు డైట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రామకృష్ణ పిలుపునిచ్చారు. 2026–27 సంవత్సరానికిగాను ఈ నెల 31న జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించడానికి రోల్‌ ప్లే, జానపద నృత్య పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో చదువుతున్న 8, 9 తరగతుల విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుత పౌరసత్వం, లింగ సమానత్వం, మాదక ద్రవ్యాల నివారణ, మానసిక ఆరోగ్యం , భద్రత తదితర అంశాలను ప్రతిబింబించేలా ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement