జేఎన్‌టీయూఏలో బజాజ్‌ శిక్షణ కేంద్రం! | - | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూఏలో బజాజ్‌ శిక్షణ కేంద్రం!

Oct 23 2026 1:39 AM | Updated on Oct 23 2026 1:39 AM

అనంతపురం: జేఎన్‌టీయూఏలో బజాజ్‌ ఇంజినీరింగ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ (బెస్ట్‌) కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తంజావూరు సమీపంలోని శస్త్ర డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ముందడుగు పడింది. జేఎన్‌టీయూఏ వీసీ హెచ్‌.సుదర్శనరావు నేతృత్వంలో అకడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వి.సత్యనారాయణ, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ ఎం.రామశేఖరరెడ్డి, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ కె.కళ్యాణిరాధ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ ఎస్‌.అరుణ మస్తానీ బృందం బుధవారం శస్త్ర వర్సిటీలో పర్యటించింది. ఈ సందర్భంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరుల ఉత్పత్తి, ఆధునిక సాంకేతిక నైపుణ్యాభివృద్ధిని అందిపుచ్చుకునేలా బజాజ్‌ ఆటో ఫౌండేషన్‌ సౌజన్యంతో బెస్ట్‌ కేంద్రాన్ని జేఎన్‌టీయూఏలో ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement