పుట్టపర్తి టౌన్: గుంటూరులో నాగార్జున, విట్ యూనివర్సటీలో నిర్వహించిన ఏపీ పోలీస్ స్పోర్ట్స్‌లో జిల్లా పోలీసులు అద్భుతమైన ప్రతిభచూపి 17 పతకాలు సాధించారు. ఇందులో భాగంగానే మంగళవారం తన చాంబర్‌లో ఎస్పీ సతీష్‌కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురానా వారిని అభినందించారు. వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, కోకో, యోగా ,400 మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం తదితర క్రీడల్లో జిల్లా చెందిన 23 మంది మూడు స్వర్ణ, 3 రజత, 11 కాంస్య పతాకాలు మొత్తం 17 పతాకాలు సాధించారు. కబడ్డీలో గోరంట్ల సీఐ శేఖర్ కాంస్య, ఏఆర్ ఆర్‌ఎస్‌ఐ వీరన్న క్రికెట్, ఖోఖోలో రజత, కాంస్య పతకాలు, సంజీవరాయుడు, మురళీమోహన్, సంజప్ప, రాంప్రసాద్, ఈశ్వర్, వీరానాయక్ ఖోఖో పోటీల్లో కాంస్య పతకాలు, ప్రసాద్ 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెం పోటీల్లో స్వర్ణ పతకం, పద్మశ్రీ పవర్ లిప్టింగ్‌లో స్వర్ణ పతకం, బ్యాడ్మింటన్‌లో రజత, 400 మీటర్ల రిలేలో రజత పతకాలు సాధించారు. అలాగే మంజమ్మ యోగాలో రజత కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఎస్పీ సతీష్ మాట్లాడుతూ క్రీడలు సిబ్బందిలో శారీర దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ పెంపొందిస్తాయన్నారు. స్పోర్ట్స్‌లో ప్రతిభచూపి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన పోలీస్ క్రీడాకారులు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాని ఆకాంక్షించారు.
17 పతకాలు సాధించడంతో అభినందించిన ఎస్పీ


