అన్ని స్థానాల్లోనూ పోటీచేయాలి | - | Sakshi
Sakshi News home page

అన్ని స్థానాల్లోనూ పోటీచేయాలి

Sep 4 2026 7:35 AM | Updated on Sep 4 2026 7:35 AM

చిలమత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి జిల్లా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలకు సూచించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆయన మంగళవారం బెంగళూరులో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులోనూ బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని సూచించారు. పెరిగిన మున్సిపల్‌ వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సమన్వయకర్తలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, టీఎన్‌ దీపిక, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఉషశ్రీచరణ్‌, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మక్బుల్‌ భాషా, వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలకు ఎంపీ మిథున్‌రెడ్డి దిశానిర్దేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement