చంద్రబాబు ‘నేతన్న భరోసా’ పేరుతో చేనేతలను ఆదుకుంటామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినా రెండేళ్ల పాటు అమలు చేయకుండా చేనేతలను మోసం చేశారు. ఇప్పుడు రెండేళ్ల సాయాన్ని ఎగ్గొట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చేనేత సంక్షోభంలో చిక్కుకుపోయింది. వేలాదిమంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి దినసరి కూలీలుగా దుర్భర జీవనం అనుభవిస్తున్నారు. మరికొంత మంది అప్పుల బాధ తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చేనేతలపై ప్రభుత్వ నిర్లక్ష్య తీరును వైఎస్సార్‌సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం చేనేత కుటుంబాలకు మూడేళ్ల సాయాన్ని రూ.75 వేలు అందించాల్సిందే. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తాం.
– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే,
ఽవైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త


