అనంతపురం టౌన్: విద్యుత్ షాక్‌తో ఆపరేటర్‌కు తీవ్ర గాయాలైన ఘటన డీ4 సెక్షన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక జేఎన్‌టీయూ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద నూతన సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. అందులో ట్రైనింగ్ షిఫ్ట్ ఆపరేటర్‌గా ఉన్న రమేష్ నాయక్ శనివారం 33కేవీ విద్యుత్ స్తంభంపైకెక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. చేతులు, కడుపు భాగం మొత్తం కాలిపోయింది. విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడడంతో తలకు సైతం గాయాలయ్యాయి. తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమేష్ నాయక్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
షిఫ్ట్ ఆపరేటర్‌తో మరమ్మతులా..?
లైన్ మరమ్మతులను విద్యుత్ అధికారులతో చేపట్టకుండా శిక్షణలో ఉన్న ఆపరేటర్‌తో చేయించడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలి సింది. ఏ లైన్‌లో విద్యుత్ సరఫరా ఉంటుందో.. ఎందులో ఉండదో వారికి కనీస అవగాహన ఉండదు. అయినా, పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగింది. ఈ విషయంపై విచారణ చేపట్టి షిఫ్ట్ ఆపరేటర్‌తో మరమ్మతులు చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


