ఆకట్టుకున్న ‘కరుణాసాగర రామా’ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ‘కరుణాసాగర రామా’

Mar 15 2026 1:29 AM | Updated on Mar 15 2026 1:29 AM

ప్రశాంతినిలయం: శ్రీరాముని గుణగణాలను, రామాయణ విశిష్టతను చాటుతూ సాగిన ‘కరుణాసాగర రామా’ నృత్య రూపకం భక్తులను పరవశింపజేసింది. పర్తియాత్రలో భాగంగా దక్షణ తమిళనాడుకు చెందిన నీలగిరీస్‌ జిల్లా భక్తులు శనివారం సాయంత్రం సత్యసాయి సన్నిధిలో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా సత్యసాయి బాలవికాస్‌ చిన్నారులు ‘కరుణా సాగర రామా’ పేరుతో భక్తి రస నృత్య రూపకం ప్రదర్శించారు. శ్రీరాముని నీతి, పితృవాక్య పరిపాలన దక్షతను చక్కగా వివరించారు. నృత్య రూపకం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. పిదప భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement