అన్ని ఏర్పాట్లు చేశాం
23 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అన్ని మౌలిక వసతులు ఉన్న 42 కాలేజీలను గుర్తించి ఏర్పాట్లు చేశాము. ప్రతి కాలేజీకి వెళ్లి పరీక్షల నిర్వహణపై అవగాహన కల్పించాం. ఎక్కడైనా ప్రైవేటు కాలేజీల్లో ఫీజు చెల్లించలేదని హాల్ టికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. పరీక్షల్లో రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిలైన విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తారు. – చెన్నకేశవప్రసాద్, డీఐఈఓ
పకడ్బందీగా నిర్వహిస్తాం
వచ్చే నెల 16 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 22 వేల పైచిలుకు విద్యార్థులు ఈ దఫా పరీక్షలకు హాజరువుతున్నారు. ఇందు కోసం 107 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాం. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండేలా చూస్తున్నాం.
– కృష్ణప్ప, డీఈఓ
అన్ని ఏర్పాట్లు చేశాం


