అధిక ధరలకు మద్యం అమ్మితే సీజ్ చేస్తాం
పుట్టపర్తి అర్బన్: మద్యం షాపుల్లో నిర్ణయించిన ధరల కంటే ఒక్క రూపాయి అదనంగా తీసుకున్నా షాపు సీజ్ చేస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ శ్రీరాం హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పుట్టపర్తి, మామిళ్లకుంట, తలమర్ల, కొత్తచెరువు, గోరంట్ల తదితర ప్రాంతాల్లో మద్యం షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాటిళ్లపై సీల్, రికార్డులను పరిశీలించారు. అనంతరం బ్రాహ్మణపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్‌ను పరిశీలించారు.
అక్రమ మద్యంపై ఉక్కుపాదం
ధర్మవరం: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం, నాటుసారా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య తెలిపారు. పట్టణంలోని ఎకై ్సజ్ స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను ఆయన పరిశీలించారు. ఎకై ్సజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతి షాపులో ప్రతి బాటిల్‌ను స్కాన్ చేసి అమ్మకాలు జరపాలని ఆదేశించారు. బెల్టుషాపులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు. ఎకై ్సజ్ నేరాలు చేసే వ్యక్తులు, పాత నేరస్తులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, ఎకై ్సజ్ సీఐ చంద్రమణి, ఎస్‌ఐలు చాంద్‌బాషా, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.


