వైభవంగా గవిమఠం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ: గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి మూలవిరాట్‌కు పూజలు నిర్వహించారు. పీఠాధిపతుల చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి కరిబసవరాజేంద్రస్వామి, మఠం ఏసీ గంజి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో కంకణధారణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మఠం ఆవరణ నుంచి పవిత్ర గంగాజలాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం కంకణ మండపంలో కుండల్లో మట్టి వేసి నవధాన్యాలు ఉంచారు. బ్రహ్మోత్సవాలు ముగిసేలోపు మట్టికుండల్లో ధాన్యాలు బాగా పండితే ఈ ఏడాది పంటలు చేతికొచ్చి రైతులు సుభిక్షంగా ఉంటారని భక్తుల విశ్వాసం.


