పోతలయ్యస్వామి జాతర ప్రారంభం
కనగానపల్లి: మండలంలోని దాదులూరులో పోతలయ్యస్వామి జాతర శుక్రవారం భక్తుల కోలాహలం మధ్య ప్రారంభమైంది. తొలిరోజు రామగిరి మండలంలోని పోతలయ్య స్వామి కాపులు యలవగంపలో స్వామివారి ఆభరణాలు, పూలహారాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత వాటిని స్వామి వారికి అలకరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. చెన్నేకేశవస్వామి ఆలయంలో పలువురు భక్తులు అన్నదాన సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. టెంకాయల కొట్టుకు రూ.2.5 లక్షలు, ప్రసాదాల కొట్టుకు రూ.50 వేల వచ్చినట్లు ఆలయ ధర్మకర్త రామలింగారెడ్డి తెలిపారు. జాతరలో రెండోరోజు శనివారం పోతలయ్య, చెన్నేకేశవస్వాములకు భక్తులు జ్యోతులు, బోనాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
పోతలయ్యస్వామి జాతర ప్రారంభం


