సిద్ధేశ్వరా.. పాహి పాహి
హేమావతి (అమరాపురం): మండల పరిఽధిలోని హేమావతి గ్రామంలో వెలసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించి మహా మంగళహారతి ఇచ్చారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని వివిధ రకాల పూలమాలతో అలంకరించి రథంపై కొలువుదీర్చారు. అశేష భక్తజనం మధ్య ఓం నమః శివాయా... సిద్ధ్వేరస్వామి మహరాజ్‌కీ జై, శంభో శంకర శివనామస్మరణలతో రథాన్ని ముందుకులాగారు. రథంపైకి అరటిపండు, బెల్లం, కొబ్బరికాయ, పూలు, మిరియాలు తదితర వాటిని విసిరి భక్తులు మొక్కుబడులు తీర్చుకున్నారు. కర్ణాటక గురువులు చేసిన వీరగాసేనృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడ, ఈఓ నరసింహరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే సర్పంచ్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం కల్పించారు. సీఐ రాజ్‌కుమార్ , ఎస్‌ఐ వలిబాషా ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
హేమావతిలో ఘనంగా
సిద్ధేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం
వేలాదిగా తరలివచ్చిన భక్తులతో
కిక్కిరిసిన మానవాకారుడి క్షేత్రం
సిద్ధేశ్వరా.. పాహి పాహి
సిద్ధేశ్వరా.. పాహి పాహి


