వైభవంగా గిరి రఽథోత్సవం
పుట్టపర్తి టౌన్: పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం సత్యసాయి గిరిరథోత్సవం వైభవంగా సాగింది. అందంగా అలకరించిన రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రశాంతి నిలయం ముఖ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్‌కూడలి,ె పెట్రోల్‌బంక్, చింతతోపు, శివాలయం వీధి, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా రథాన్ని లాగుతూ ప్రశాంతినిలయానికి చేర్చారు. కార్యక్రమంలో దేశవిదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయండి : డీఎంహెచ్‌ఓ
పుట్టపర్తి అర్బన్: వైద్య, ఆరోగ్య శాఖ కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేష్‌బాబు ఆదేశించారు. శుక్రవారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆరోగ్య విస్తరణాధికారులు, సామాజిక ఆరోగ్యాధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సునీల్, డీపీఎంఓ నాగేంద్రనాయక్, ఎంపీహెచ్‌ఈఓ, సీహెచ్‌ఓ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పొరకల వన్నప్ప, రాష్ట్ర సహాయ అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి మోహన్‌బాబు, కోశాధికారి బాలాజీరావు, సహా అధ్యక్షురాలు సాంబశివమ్మ, నాయకులు శివరాం, నగేష్, రామచంద్రారెడ్డి, జయరాంనాయక్, రామాంజనేయులు. సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
టెట్ నుంచి మినహాయించాలి
● ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
పుట్టపర్తి: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపునివ్వాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయంలో ఎస్టీఏ, ఏపీటీఎఫ్ (1938) సంఘాల నేతలు వేర్వురుగా డీఈఓ కృష్ణప్పను కలిశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్లను డీఈఓ ఆవిష్కరించారు. అనంతరం సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు కూడా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాప్‌లతో బోధనేతర పనులు అప్పగిస్తున్నారని, దీంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎస్టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారుతీ ప్రసాద్, జయకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ మక్కిశెట్టి కుమార్, కోశాధికారి ప్రదీప్, డివిజన్ నేతలు శ్రీనివాసులు, బాబు, రమేష్, సురేష్, లోకేష్, కృష్ణ, శ్రవణ్, రేవతి, రమేష్‌బాబు తదితరులు, ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడు బడా హరి ప్రసాదరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, గోపాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ బాబు, రాష్ట్ర కౌన్సిలర్ సాయి శంకర్, అలీముల్లా, జిల్లా కార్యదర్శులు జయరామిరెడ్డి, సుందర్‌రాజు, నరసింహప్ప తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని
వృద్ధురాలి దుర్మరణం
ధర్మవరం అర్బన్: స్థానిక ఎర్రగుంట జంక్షన్‌లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వృద్ధురాలు (75) దుర్మరణం పాలైంది. శుక్రవారం తెల్లవారుజామున అర్బన్ హెల్త్ సెంటర్ ఎదుట ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహన చక్రాల కింద పడడంతో శరీరం ఛిద్రమైపోయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ముక్కలైన వృద్ధురాలి మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చరీకి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96831, 79810 45464కు సమాచారం ఇవ్వాలని వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ కోరారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వైభవంగా గిరి రఽథోత్సవం
వైభవంగా గిరి రఽథోత్సవం
వైభవంగా గిరి రఽథోత్సవం


