స్కూల్ అసిస్టెంట్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ర
పరిగి: జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్ల అసోసియేషన్ జిల్లా కార్యవర్గం అధ్యక్షుడిగా పరిగి మండలం సేవామందిరం ఏఎం లింగణ్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రామలింగప్ప ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు చింతల సుబ్బారావు, జనరల్ సెక్రెటరీ సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సీకే పల్లి మండలం న్యామద్దెలలో జరిగిన సమావేశంలో ఈ ఎన్నికను నిర్వహించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ, కోశాధికారిగా సచీంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గోవిందప్ప, కార్యదర్శులుగా విజయభార్గవి, నారాయణస్వామి, మహిళా విభాగంలో భాగ్యమ్మ, అనూరాధ, శోభారాణి, కార్యవర్గ సభ్యులుగా గౌస్ సాహెబ్, రామచంద్రరావు, గంగాధర్, ఉమేష్‌ను ఎన్నుకున్నారన్నారు.


