మధురగానం
నాయి నామం..
కార్తీక మాసం చివరి రోజు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఉదయమే ఆలయాల ఎదుట బారులు తీరిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేళ ఆలయాల్లో లక్ష దీపోత్సవాలు నిర్వహించారు. కార్తీక అమవాస్య సందర్భంగా మడకశిర మండలం నీలకంఠాపురంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. పుష్కరిణికి గంగాహారతి ఇచ్చారు. ఇక అనంతపురం హెచ్చెల్సీ కెనాల్ శివాలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం ఆలయ ఆవరణలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం హెచ్చెల్సీ కెనాల్‌లో గంగ హారతి ఇచ్చారు. శివమాలధారులు భారీగా పాల్గొన్నారు. – సాక్షి బృందం:
ప్రశాంతి నిలయం: సాయి నామం.. మధురగానాలతో పర్తిక్షేత్రం ఆధ్యాత్మిక అనుభూతులు పంచుతోంది. దేశ విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన అశేష భక్తజనం మధ్య సత్యసాయి శత జయంత్యుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ సంగీత విద్యాంసులు సాయీశ్వరున్ని కీర్తిస్తూ కచేరీలు నిర్వహిస్తుండగా..భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. సత్యసాయి సేవా సంస్థల అంతర్జాతీయ సదస్సులో భాగంగా గురువారం సాయంత్రం సత్యసాయి సేవా సంస్థల బృందం సభ్యులు ‘సత్యసాయి రాగమాల’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయి అవతార వైభవం..ఆయన చూపిన మార్గాన్ని చక్కటి గీతాలతో వినిపించారు. సంగీత కళాకారులతో భక్తులు కూడా గొంతు కలపడంతో సభా మందిరం సత్యసాయి నామంతో మార్మోగింది. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
అట్టహాసంగా సేవా సంస్థల జాతీయ సదస్సు
గురువారం ఉదయం సత్యసాయి సేవా సంస్థల 11వ జాతీయ సదస్సును అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి గడ్కరీ తొలుత సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులనుద్దేశించి ప్రసంగించారు. అందరినీ ప్రేమించి...సేవించాలన్న సత్యసాయి ప్రవచనం ప్రతి ఒక్కరి జీవితంలోనూ తారకమంత్రంగా పనిచేయాలన్నారు. తాను కూడా ఇక్కడి సేవా భావాన్ని చూసి భవిష్యత్‌లో మరింత మంచి పనులు చేయాలన్న ప్రేరణ పొందానన్నారు. అంతకుముందు సత్యసాయి యజుర్ మందిరం నుంచి ట్రస్ట్, సేవా సంస్థల సభ్యులు ర్యాలీగా సాయికుల్వంత్ సభా మందిరానికి వచ్చారు. ఆయా దేశాల జాతీయ పతాకాలతో పాటు సత్యసాయి సేవా సంస్థల పతాకాలను, సత్యసాయి సర్వధర్మ చిహ్నాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలతో కూడిన పుస్తకాన్ని సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు విడుదల చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌రాజు, పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శిల్పారామంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. గురువారం కూచిపూడి కళాక్షేత్రం బృందం సభ్యులు తమ గురువు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. పట్టణ ప్రముఖులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తన హాజరై తిలకించారు. ఈ నెల 23 తేదీ వరకూ శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని శిల్పారామం ఏఓ ఖాదర్‌బాషా తెలిపారు.
కార్తీకం.. ఆధ్యాత్మిక పరవశం
వైభవంగా సత్యసాయి
శత జయంత్యుత్సవాలు
ఘనంగా సేవా సంస్థల జాతీయ సదస్సు
హాజరైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
అలరించిన ‘సత్యసాయి రాగమాల’
మధురగానం
మధురగానం
మధురగానం
మధురగానం
మధురగానం
మధురగానం


