విధిగా నిర్వహించాల్సిందే
ప్రతి నెలా తల్లిదండ్రుల సమావేశాలు విధిగా నిర్వహించాలి. ఇదే విషయంపై హెడ్మాస్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంఈఓలు పర్యవేక్షించాలి. ప్రతి నెలా క్రమం తప్పకుండా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల ప్రగతి, ఎటువంటి సమస్యలు ఉన్నాయో అర్థమవుతుంది. అనంతరం వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కచ్చితంగా సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – కిష్టప్ప, డీఈఓ


