మొరాయించిన సుబ్బరాయసాగర్ షట్టర్లు
● ఆందోళనలో రైతులు
పుట్లూరు: సుబ్బరాయసాగర్ షట్టర్లు మొరాయించాయి. ఈ క్రమంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 13న సుబ్బరాయసాగర్ నుంచి నీటి సరఫరాను హెచ్చెల్సీ అధికారులు ప్రారంభించారు. వారం రోజులు పూర్తయినా ఇప్పటికీ పుట్లూరు చెరువుకు నీరు చేరుకోలేదు. షట్టర్లలో సమస్య ఉన్నట్లు గుర్తించిన అధికారులు మరమ్మతుల కోసం శివమొగ్గ నుంచి నిపుణులను రప్పిస్తున్నారు. ప్రస్తుతం సుబ్బరాయసాగర్‌లో 12 మీటర్ల నీటి మట్టం ఉంది. షట్టర్ల మరమ్మతులు ఆలస్యమైతే సాగర్‌లో నీరు ఇంకిపోయి చెరువులను నింపే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


