‘సర్పంచ్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి’
పెనుకొండ రూరల్: సోమందేలపల్లి మండలం నాగినాయనిచెరువు సర్పంచ్ అంజినాయక్‌పై ఆదివారం నల్గొండ్రాయునిపల్లి, సోమందేపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు 30 మంది మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ సోమవారం బాధితుడు అంజినాయక్‌తో కలసి డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ నర్శింగప్పకు విన్నవించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పట్టణ, మండల కన్వీనర్లు నరసింహులు, సుధాకర్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్, మండల కన్వీనర్ గజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
వీరజవాన్ మురళీనాయక్ త్యాగం జాతి మరవదు
● వైఎస్సార్‌సీపీ శింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్
గోరంట్ల: వీర జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని భరత జాతి ఎన్నటికీ మరిచిపోదని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వెఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. సోమవారం కల్లితండాకు చేరుకున్న ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్‌ను పరామర్శించారు. అనంతరం వీరజవాన్ మురళీనాయక్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శత్రుమూకలతో మురళీనాయక్ సాగించిన వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గోరంట్ల జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాంనాయక్, శింగనమల వైఎస్సార్‌సీపీ నాయకులు కాటమయ్య, ప్రసాద్, శివశంకరనాయక్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్‌కు జ్ఞానీ
జైల్‌సింగ్ స్మారక పురస్కారం
తాడిమర్రి: మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నీరుగట్టు వెంకటేష్‌కు మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ స్మారక పురస్కారం దక్కింది. గత 30 ఏళ్లుగా వివిధ దిన పత్రికల్లో విలేకరిగా ఆయన పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయూ) యూనియన్ స్థాపించి ఐదు వసంతాలు పూర్తీ చేసుకున్న సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ స్పీకర్ షరీఫ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
గోరంట్లలో అగ్ని ప్రమాదం
గోరంట్ల: స్థానిక పోలీసుస్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీనివాస కాటన్ బజార్‌లో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోరంట్ల పట్టణానికి చెందిన ఇద్దరి భాగస్వామ్యంతో తమిళనాడుకు చెందిన గోకుల్ అనే వ్యక్తి శ్రీనివాస కాటన్ బిగ్ బజార్ ఏర్పాటు చేశారు. సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు రాజుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు రూ.50 లక్షల పైచిలుకు దుస్తులు, ఓ ద్విచక్ర వాహనం, ఆరు సీసీ కెమెరాలు కాలిపోయాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
26 నుంచి అగ్నివీర్ మురళీనాయక్
స్మారక క్రికెట్ టోర్నీ
అనంతపురం: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ స్మారకార్థం ఈ నెల 26 నుంచి అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఉమ్మడి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, అనంతపురం నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడా జట్లు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 80085 50464, 79893 69100, 73969 27271, 98855 31051, 94407 58953లో సంప్రదించాలని కోరారు.
‘సర్పంచ్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి’
‘సర్పంచ్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి’
‘సర్పంచ్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి’


