పుట్టపర్తి: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిసినట్లు పరీక్షల నిర్వహణాధికారి, జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. గురువారం ఆయన హైపవర్ కమిటీ అధికారి లక్ష్మీకాంతరెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ రంజిత్‌నాయక్, డీఈసీ మెంబర్లు చెన్నకేశప్రసాద్, శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు ముగిశాయని, ఒకేషనల్ పరీక్షలు శుక్రవారంతో ముగుస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం 3,112 మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 2,933 మంది హాజరయ్యారు. అలాగే 740 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 695 మంది హాజరైనట్లు చెప్పారు.