●అభివృద్ధికి పట్టం కట్టండి | Sakshi
Sakshi News home page

●అభివృద్ధికి పట్టం కట్టండి

Published Sat, Apr 13 2024 12:10 AM

పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి   - Sakshi

రాప్తాడు: మండలంలోని పాలచెర్ల గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పాలచెర్లకు చెందిన 8వ వార్డు మెంబర్‌ దేవర ఎర్రిస్వామి, చిట్రా బాలరాజు, బంగారు ముత్యాలు, బంగారు మూర్తి, చెరుకూరి నాగేంద్ర, కురుబ రంజీత్‌, పవన్‌ కుమార్‌ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మేకలు, గొర్రెల సహకార సొసైటీ చైర్మన్‌ పసుపుల నరసింహాగౌడ్‌, వైస్‌ ఎంపీపీ బోయ రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ జూటూరు శేఖర్‌, బీసీ సెల్‌ నాయకులు పసుపుల ఆది, చిట్రా వెంకటేష్‌, మాజీ సర్పంచులు సదానంద రెడ్డి, బండి శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నాయకులు బిల్లే అభిలాష, మదుసూధన్‌ రెడ్డి, రఘనాధ్‌ రెడ్డి, చిట్రా లక్ష్మీనారాయణ, లింగమయ్య, ఎర్రిస్వామి, సుమన్‌, పోతన్న, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేశాం.. ఈ ఎన్నికల్లో అండగా నివాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మాట ఇస్తే వెనకడుగు వేయకుండా అమలు చేస్తారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందేలా చేస్తున్నారన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పఽథకాలు అందాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement