
పుట్టపర్తి: స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే 193 చెరువుల అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.
భూసేకరణ
సత్వరమే పూర్తి చేయండి
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన భూ సేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ చేతన్ ఆదేశించారు. ఎన్‌హెచ్ 342, ఎన్‌హెచ్ 716జి, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో బుధవారం సాయంత్రం ఆయన సమీక్షించారు. జాతీయ రహదారులకు సంబంధించి సేకరించిన భూమికి సంబంధించి నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వివరాల నివేదిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం ఆర్డీఓలు భాగ్యరేఖ, వంశీకృష్ణారెడ్డి, రమేష్‌రెడ్డి, నేషనల్ హైవే ఈఈ మధుసూధనరావు, డీఈ గిడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు.
పాము కాటుతో రైతు మృతి
పావగడ: తాలూకా పరిధిలోని రాయచర్లు గ్రామానికి చెందిన రైతు గోవిందప్ప(55) పాము కాటుతో మృతి చెందాడు. మంగళవారం రాత్రి తన పొలంలో పంటకు నీరు కడుతున్న సమయంలో పాము కాటు వేసింది. తక్షణమే గోవిందప్పను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటన పై తిరుమణి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

సీఎంతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి