ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

Nov 5 2026 12:16 AM | Updated on Nov 5 2026 12:16 AM

● ముగ్గురికి తీవ్రగాయాలు

మనుబోలు: ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై జ్యోతి నగర్‌ వద్ద బుధవారం జరిగింది. బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గూడూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 45 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి గూడూరుకు వెళ్తోంది. దారిలో మండలంలోని జ్యోతినగర్‌ వద్ద ప్రయాణికులు దిగేందుకు డ్రైవర్‌ బస్సును ఆపాడు. అదే సమయంలో నెల్లూరు వైపు నుంచి చైన్నె వెళ్తున్న లారీ వెనుక నుంచి బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి, గూడూరు రూరల్‌ మండలం సంతదాసుపల్లికి చెందిన వై.జయంతి, గూడూరు టౌన్‌కు చెందిన మునెమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement