బెదిరించినా పోరాడి గెలిచారు | - | Sakshi
Sakshi News home page

బెదిరించినా పోరాడి గెలిచారు

Nov 5 2026 12:16 AM | Updated on Nov 5 2026 12:16 AM

● మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు: ‘కూటమి నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా లెక్కచేయకుండా ఆత్మకూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో నిలబడి గెలిచిన, పోటీ చేసిన అభ్యర్థులకు అభినందనలు. వారి సేవల్ని పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’ అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన పదిమంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లతోపాటు పోటీచేసిన వారిని పార్టీ కార్యాలయంలో బుధవారం విక్రమ్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు పేర్నేటి కోటేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పోటాపోటీగా నిలిచి విజయం సాధించిన 9వ వార్డు అభ్యర్థిని నాగులపాటి స్వప్న, 19వ అభ్యర్థి పఠాన్‌ సర్దార్‌ ఖాన్‌ను విక్రమ్‌రెడ్డి శాలువాకప్పి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు పార్టీ నాయకులకు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి తమ గెలుపుకు కారణమైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సీహెచ్‌ ఆదిశేషయ్య, పట్టణాధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, పార్టీ మున్సిపల్‌ విభాగ రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, అల్లారెడ్డి ఇందుమతి, గెలిచిన కౌన్సిలర్లు వై.కల్పన, దిల్షాద్‌ మహమ్మద్‌, సుగుణమ్మ, అండ్రా సుబ్బారెడ్డి, ఆదిలక్ష్మమ్మ, మల్లెంకొండయ్య, కృపాకర్‌, నందవరం ప్రసాద్‌, ముజీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement