గెలుపు కోసం
● కోడ్ ఉల్లంఘించి కాలనీలో రోడ్డు పనులు
● రెండున్నరేళ్లలో పట్టించుకోని వైనం
● చోద్యం చూస్తున్న అధికారులు
చిల్లకూరు: పరిషత్ ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకోసం అధికారాన్ని వాడుకుంటున్నారు. మండలంలోని నెలబల్లిరెట్టపల్లి సెగ్మెంట్ పరిధిలో బూదనం పంచాయతీలోని పట్రగుంటలో సుమారు 40 కుటుంబాల వారు జీవిస్తున్నారు. సెగ్మెంట్లో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ వారు బరిలో ఉన్నారు. ఇరు పార్టీ నేతలు ప్రచారం చేసే సమయంలో కాలనీలో అంతర్గత రోడ్డు సౌకర్యం సక్రమంగా లేదని స్థానికులు చెప్పారు. రెండున్నర సంవత్సరాల్లో ఎప్పుడూ పట్టించుకోని టీడీపీ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం రోడ్డు వేపిస్తామని చెప్పేశారు. ఈ క్రమంలో బుధవారం జేసీబీతో రోడ్డు చదును చేయించి గ్రావెల్ రోడ్డును పూర్తి చేయించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేట్టకూడదని కచ్చితమైన ఆదేశాలున్నాయి. అయితే నేతలు నియమావళిని తుంగలో తొక్కి తమ అధికార దర్పం ఉపయోగించారు. అభ్యర్థికి స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఇలా కార్యక్రమాలు చేపట్టడం విమర్శలకు దారి తీసింది.


