దిల్షాద్ మొహ్మద్ (17)
కల్పన (25వ వార్డు)
స్వప్న (9)
సుబ్బారెడ్డి (2)
సుగుణమ్మ (22)
ప్రసాద్ (23)
కృపాకర్ (26)
ఆదిలక్ష్మమ్మ (18)
మల్లెంకొండయ్య (20)
సర్దార్‌ఖాన్ (19)
● ఆత్మకూరులోని పది వార్డుల్లో
వైఎస్సార్సీపీ విజయం
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు మున్సిపాల్టీ ఎన్నికల్లో పలు వార్డుల్లో స్వల్ప ఓట్ల తేడాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. మొత్తం 28 స్థానాలకు జరిగిన ఎలక్షన్లలో పదింట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఒక వార్డును మిత్రపక్షంగా నిలిచిన సీపీఎం దక్కించుకున్నాయి. జనసేన రెండు.. బీజేపీ ఒకటి.. జనసేన రెబల్ అభ్యర్థి ఒకటి.. స్వతంత్య్ర అభ్యర్థి మరో వార్డులో గెలుపొందారు. అధికార టీడీపీ 12 వార్డులను దక్కించుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతిపై టీడీపీ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా 2206 ఓట్లతో గెలుపొందారు.


