● మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు రూరల్: రాష్ట్రంలో 2029లో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఆత్మకూరు నుంచే ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రామస్వామిపల్లి, మహిమలూరు గ్రామాల్లో మంగళవారం పర్యటించిన ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మున్సిపాల్టీలో కూటమి పార్టీలకు దీటుగా తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. 3, 27వ వార్డుల్లో అధికార బలంతో పదేపదే రీ కౌంటింగ్ చేసి టీడీపీ గెలుపొందింటూ అధికారులు ప్రకటించారని, పోలింగ్ ప్రక్రియపై టీడీపీ ఒత్తిడికి ఇది అద్దం పడుతోందని చెప్పారు. పార్టీకి కంచుకోటగా ఉన్న రామస్వామిపల్లి, బంట్లపల్లి, మహిమలూరు, బసవరాజుపాళెం, కోటపాడు గ్రామాల్లో నిర్వహించనున్న పల్లె పోరులో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు చిట్టమూరు జితేంద్రనాగ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


