నెల్లూరు సిటీ: నగరంలో మంత్రి నారాయణకు జనసేన అభ్యర్థి షాకిచ్చారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు తొలుత కుదరలేదు. ఈ క్రమంలో గ్లాస్ పార్టీ రాష్ట్ర నేత శివశంకర్ నెల్లూరు చేరుకొని బీ ఫారాలను పంపిణీ చేశారు. దీంతో కంగుతున్న టీడీపీ నేతలు మరుసటి రోజు ఉదయాన్నే సమావేశాన్ని నిర్వహించి.. నెల్లూరు సిటీ, రూరల్‌లో నాలుగు చొప్పున కేటాయిస్తున్నామని ప్రకటించారు. అయితే ఆరో డివిజన్లో బీజేపీ, జనసేన అభ్యర్థులు బీ ఫారాలతో నామినేషన్లేశారు. చివరికి ఇద్దరూ భీష్మించుకొని ఉపసంహరించుకోలేదు. జనసేన అభ్యర్థి శ్రీకాంత్‌కు సర్దిచెప్పేందుకు మంత్రి యత్నించినా, ప్రయోజనం కరువైంది.
పనిచేయని ప్రచారం
ఆరో డివిజన్లో బీజేపీ అభ్యర్థి సుకుమార్‌కు ఓటేయాలంటూ మంత్రి నారాయణ ప్రచారం చేశారు. జనసేనకు ఓటేయొద్దంటూ టెలి కాన్ఫరెన్స్‌లోనూ ఆదేశించారు. డివిజన్లో ఓటుకు రూ.రెండు వేల చొప్పున ఈయన టీమ్ పంపిణీ చేసింది. అయితే టీడీపీ ముఖ్యనేత, ఆలయ చైర్మన్.. శ్రీకాంత్‌కు ఆర్థికంగా సాయం చేసి, వెనుకుండి ఓట్లేయించారనే ప్రచారం సాగుతోంది. దీంతో నారాయణ మంత్రం ఫలించలేదు.
● ఆరో డివిజన్లో కమలనాథులకు ఓటేయాలంటూ ప్రచారం
● జనసేనకు కేటాయించిన సీటు చివరి నిమిషంలో బీజేపీకి
● గ్లాస్ పార్టీకి వేయొద్దంటూ
టెలి కాన్ఫరెన్స్‌లోనూ ఆదేశాలు
● డివిజన్లో రూ.రెండు వేల చొప్పున పంపిణీ
● శ్రీకాంత్ విజయంతో కంగుతున్న కూటమి నేతలు


