● టీడీపీకి సహకరించిన
పోలీస్, అధికార యంత్రాంగం
● బూత్‌ల వద్దకు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లకుండా అడ్డుకున్న వైనం
నెల్లూరు(బారకాసు): నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాల్టీలకు సంబంధించి ఆదివారం నిర్వహించిన పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం ఐదు గంటల్లోపు చేరుకున్న వారికి ఓటేసే అవకాశాన్ని కల్పించారు. నగరంలోని పలు చోట్ల ప్రతిపక్ష పార్టీ నేతలను కేంద్రాల వద్దకు వెళ్లనీయకుండా పోలీస్ అధికారులు అడ్డుకున్నారు.
పర్వతరెడ్డిని అడ్డుకున్న ఖాకీలు
పోలింగ్ ప్రక్రియ పరిశీలన నిమిత్తం మినీబైపాస్ నుంచి బాలాజీనగర్‌లోని స్వామిదాస్ స్కూల్‌కు వెళ్లేందుకు ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ప్రశ్నించగా, లా అండ్ ఆర్డర్ సమస్యొస్తుందని, నోటీస్‌ను ఉన్నతాధికారులకు జారీ చేయాలని చెప్పారంటూ అందజేశారు. దీంతో ఎమ్మెల్సీతో పాటు పార్టీ మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పోలీస్ అధికారులతో మాట్లాడినా, వారు ససేమిరా అన్నారు. ఈ తరుణంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
కూటమి నేతలకు దాసోహం
● కూటమి నేతలకు పోలీస్, అధికారం యంత్రాంగం దాసోహమైంది.నగరంలోని 12వ డివిజన్లో గల బీవీఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం బయట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పెళ్లూరు శ్రీనివాసులుతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
● తమ పార్టీకే ఓటేయాలంటూ జెండావీధి, కోటమిట్టలోని మున్సిపల్ స్కూళ్లలో ఏర్పాటు చేసిన బూత్‌ల వద్ద టీడీపీ శ్రేణులు ప్రచారం చేశారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
● నవాబుపేటలోని నగరపాలక ఉన్నత పాఠశాలలో 14వ డివిజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన బూత్‌లోకి అధికార పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని సాయంత్రం ఐదు తర్వాత పోలీసులు పంపారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధనూజను అడ్డుకున్నారు. తమ పార్టీకి ఓ న్యాయం.. టీడీపీకి మరో న్యాయమానంటూ ఆమె ప్రశ్నించారు.విషయం తెలు సుకున్న ఆనం విజయకుమార్‌రెడ్డి అక్కడికొచ్చి పోలీసులతో మాట్లాడి ఆమెను పోలింగ్ కేంద్రంలోకి పంపేలా చేశారు.


