మద్యం మత్తులో బీభత్సం | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో బీభత్సం

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

● ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి

● కారు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

వాకాడు: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మండలంలోని కొండాపురం సెగ్మెంట్‌కు సంబంధించి జానరపేట గ్రామంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోండగా ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఏనుగు సుధాకర్‌ నాయుడు ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో తూపిలిపాళెం తీరం నుంచి కారు మితిమీరిన వేగంతో వచ్చి పక్కన నిలిపి ఉంచిన మరో కారు, ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ప్రచారంలో ఉన్న కార్యకర్తలపైకి దూసుకెళ్లడంతో కావలి వెంకటేష్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సుధాకర్‌ నాయుడు వెంటనే క్షతగాత్రుడిని నెల్లూరులోని నారాయణ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వారిని పట్టుకుని వాకాడు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎస్సై నిఖిల్‌బాబు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement