ఓటమి భయంతోనే చంద్రబాబు అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే చంద్రబాబు అరాచకాలు

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

వెంకటాచలం: ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిన చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలోని కసుమూరు పంచాయతీలో ఆదివారం కాకాణి పర్యటించారు. ఆయనకు గ్రామస్తులు, మహిళలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. జగనన్న పాలనలో ఏ సమస్య తలెత్తినా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పరిష్కారం చేసేవారన్నారు. ప్రస్తుతం తమ గ్రామంలో సమస్యలు పట్టించుకునేవారు కరువయ్యారని వాపోయారు. ఈ సందర్భంగా కసుమూరు – 1, కసుమూరు – 2 ఎంపీటీసీ అభ్యర్థులు మందా చంద్రశేఖర్‌, చీకుర్తి శేషయ్య, జెడ్పీటీసీ అభ్యర్థి డక్కిలి వెంకటరమణమ్మను ప్రజలు గెలిపించాలని కాకాణి కోరారు. – గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 90 శాతానికి పైగా అమలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనైనా రెండన్నరేళ్ల పాలనలో అమలు చేశారా అని ప్రశ్నించారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఆరునెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేశారన్నారు. కూటమి రెండన్నరేళ్ల పాలనలో ఒక్క పెన్షన్‌ కూడా మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ పాలనలో మంజూరైన వాటినే చంద్రబాబు ఇస్తున్నారనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేయడం సిగ్గు చేటన్నారు.

సర్వేపల్లికి ఏం చేశాడో చెప్పే

దమ్ముందా?

సర్వేపల్లి నియోజకవర్గానికి రెండన్నరేళ్ల కూటమి పాలనలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని కాకాణి ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని దోచుకోవడం.. దాచుకోవడం తప్ప చేసింది శూన్యమన్నారు. కసుమూరులో వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.కోట్లతో పనులు చేశామన్నారు. ప్రస్తుత పాలనలో విలువైన దేవాలయ భూమిని సోమిరెడ్డి కాజేసేందుకు ప్రయత్నాలు చేసి గ్రామస్తుల చేత ఛీ కొట్టించుకున్నాడని విమర్శించారు. సోమిరెడ్డి తన పర్యటనలో తమ పార్టీ వాళ్లను తిట్టడం తప్ప, ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాడన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశామని గర్వంగా చెప్పుకుంటున్నామని, చంద్రబాబు పాలనలో పింఛన్లు, రేషన్‌ సరుకులు సక్రమంగా రావడం లేదన్నారు. ఊరూరా వెలిసిన బెల్టు షాపులతో మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మాజీ సర్పంచ్‌ కడివేటి శివ, శ్రీధర్‌నాయుడు, గుర్రం పుట్టయ్య, చీకుర్తి నరసయ్య, మస్తానయ్య, మందా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రెండు ప్రభుత్వాల పాలనపై బేరీజు వేసి ఓట్లు వేయాలి

మాజీ మంత్రి

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement