● ప్రచార వాహనాలపై కేసు
కోట: మండలంలో పోటీలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను పోలీసులు టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. అందులో భాగంగా ఊనుగుంటపాళెంలో నాలుగు ప్రచార ఆటోలను ఆదివారం పోలీసులు స్వా ధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ ఊరిలో వైఎస్సార్‌సీపీ నేతల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. జెడ్పీటీసీ అభ్యర్థి అనిత, ఎంపీటీసీ అభ్యర్థి శైలజమ్మకు మద్దతుగా నాయకులు ప్రచారంలో పాల్గొని ఓటర్లను కలుస్తున్నారు. అన్ని కాలనీల్లో జనం బ్రహ్మరథం పడుతుండటంతో తట్టుకోలేని కొందరు స్థానిక టీడీపీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలకు తెరతీశారు. ప్రచారంలో ఉన్న నాలుగు ఆటోలను పోలీసులు తీసుకెళ్లి స్టేషన్‌లో పెట్టారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేశారు. నలుగురు ఆటో డ్రైవర్లు పెంచలయ్య, వంశీ, ధనుంజయ, శ్రీనివాసులుపై కేసులు నమోదు చేసినట్లు ఏఎస్సై శోభారాణి తెలిపారు.
విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు
● జిల్లా ప్రత్యేక విద్యుత్ అధికారిగా రమణాదేవి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాకు తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక విద్యుత్ అధికారిగా తిరుపతి కార్పొరేట్ కార్యాలయానికి చెందిన చీఫ్ జనరల్ మేనేజర్ రమణాదేవిని సీఎండీ శివశంకర్ నియమించారు. దీంతో ఆమె ఆదివారం నగరంలోని విద్యుత్ భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని సబ్ డివిజన్లలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు చేయాలన్నారు. అధికారులు వారి హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలన్నారు. సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ సుధాకర్, డీఈటీ అల్తాఫ్, నెల్లూరు టౌన్ ఈఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాలు జరగకుండా చూడాలి
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎండీ శివశంకర్ ఆదివారం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలు జరిగిన వెంటనే టోల్‌ప్రీ నంబర్లు 1912, 1800 425 155333, 91333 31912కు సమాచారం ఇవ్వాలన్నారు. పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు.


