మారుతున్న రాజకీయ సమీకరణాలు | - | Sakshi
Sakshi News home page

మారుతున్న రాజకీయ సమీకరణాలు

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

● బట్టేపాటి నరేంద్రరెడ్డికి ప్రలోభాలు

● ఇందుకూరుపేట జెడ్పీటీసీ అభ్యర్థిగా మావులూరు శ్రీనివాసులురెడ్డి

కోవూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇందుకూరుపేట మండలంలో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వ్యూహ.. ప్రతివ్యూహాలతో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది. జెడ్పీ చైర్మన్‌ పదవిని దక్కించుకోవడమే లక్ష్యంగా ఇక్కడి టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్కెచ్చేశారు. తనకు పోటీ లేకుండా చేసుకునేందుకు గానూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బట్టేపాటి నరేంద్రను తప్పించే యత్నాల్లో భాగంగా రూ.కోట్లల్లో బేరసారాలు జరిగాయని సమాచారం. ఇదిలా ఉండగా, ఈయనకు పార్టీ బీ – ఫారాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇవ్వలేదని సమాచారం. పార్టీ ఇందుకూరుపేట జెడ్పీటీసీ అభ్యర్థిగా మావులూరు శ్రీనివాసులురెడ్డి బరిలో నిలిచే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్‌ నడుస్తోంది.

జెడ్పీటీసీ బరిలో

తహసీల్దార్‌ సతీమణి

● టీడీపీ తరఫున పోటీ

చిట్టమూరు: టీడీపీ చిట్టమూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా తహసీల్దార్‌ సతీమణి బరిలో ఉన్నారు. చిల్లకూరు తహసీల్దార్‌ సతీమణి పెళ్లూరు సౌజన్య బరిలో నిలవడం మండలంలో చర్చనీయాంశమైంది. మండలంలోని బురదగాలికొత్తపాళేనికి చెందిన ఈమె నామినేషన్‌ను దాఖలు చేశారు.

తీరం.. అల్లకల్లోలం

వాకాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీని ప్రభావంతో వాకాడు మండల పరిధిలోని తూపిలిపాళెం సముద్ర తీరంలో అలల ఉధృతి పెరిగింది. సముద్రం సుమారు పది మీటర్ల మేర ముందుకొచ్చిందని స్థానికులు చెప్తున్నా రు. వేటను మత్స్యకారులు శనివారం అర్ధరాత్రి నుంచే నిలిపేసి చేసి తమ వేట సామగ్రిని ఒడ్డుకు చేర్చారు.

చెక్‌పోస్టుల్లో

ఆకస్మిక తనిఖీ

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో అయ్యప్పగుడి, చింతారెడ్డిపాళెం జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎస్పీ అజిత వేజెండ్ల ఆదివారం తనిఖీ చేశారు. వాహన తనిఖీ విధానం, సిబ్బంది పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. నగదు, మద్యం, బహుమతుల అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. తనిఖీల సమయంలో నగదు, ఇతర వస్తువులకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తనిఖీలకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని సూచించారు. వేదాయపాళెం, బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, సాంబశివరావు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 81,768 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 34,018 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.57 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement