వరికుంటపాడు: మండలంలోని తోటలచెరువుపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ను రాయవరపు నారాయణ దాఖలు చేశారు. అయితే పత్రంలో అభ్యర్థి భార్య వృత్తి వివరాల్లేవంటూ నామినేషన్‌ను ఆర్వో వెంకటేశ్వర్లు తిరస్కరించారు. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇలా ఎప్పుడూ జరగలేదని ఆయన ఆరోపించారు.
● విరువూరు ఎంపీటీసీ అభ్యర్థిగా తూర్పుపాళేనికి చెందిన పాలకొల్లు తిరుపతిరెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించారు. పత్రంలో అభ్యర్థి భార్య ఆస్తుల వివరాల్లేవంటూ రిజెక్ట్ చేశారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను, ఇలా చిన్న కారణాలతో తిరస్కరించడాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.
నారాయణ
తిరుపతిరెడ్డి


