దుత్తలూరు(ఉదయగిరి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దుత్తలూరు ఆర్వో రమణరావు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఎంపీటీసీల నామినేషన్ల పరిశీలనలో తిరస్కరించేందకు అవకాశం లేకపోయినా, వివిధ కారణాలను చూపుతూ నాలుగు సెగ్మెంట్ల పరిఽధిలోని తొమ్మిది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పత్రాలను రిజెక్ట్ చేశారు. వాస్తవానికి పరిశీలనను గంటల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉన్నా, అలా వ్యవహరించలేదు. నందిపాడు, కొత్తపేట, నర్రవాడ, బోడవారిపల్లి సెగ్మెంట్లలో అధికార టీడీపీ నేతలు సూచించిన విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నందిపాడుకు చెందిన అభ్యర్థిపై కేసుల్లేకపోయినా, ఆర్వో పట్టించుకోకుండా తిరస్కరించారు. కొత్తపేట, నర్రవాడ, బోడవారిపల్లిలో నామినేషన్ పత్రంలో ఆదాయాన్ని అక్షరాల్లో రాయలేదనే సాకుతో రిజెక్ట్ చేశారు.


