చిల్లకూరు: గూడూరులోని నామినేషన్ కేంద్రాల వద్ద బయటి ప్రాంతాల వ్యక్తులతో టీడీపీ వర్గీయులు నానా యాగీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కేంద్రాల వద్దకు రానీయకుండా అడ్డుకొని భయందోళనలను సృష్టించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలోకి వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి అట్ల సంపూర్ణమ్మ నామినేషన్ను టీడీపీ మూకలు లాక్కొని చించేస్తున్నా, పోలీసులు అడ్డుకున్న దాఖలాల్లేవు. కాండ్రకు చెందిన అభ్యర్థి ఉగ్గుమూడి శ్రీదేవమ్మ బైక్ దిగేలోపు ఆమెను తోసేసి చీరను చించేశారు. చిల్లకూరు మండలంలోని నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు.


