నెల్లూరు (పొగతోట): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల హోరు కొనసాగింది. గురువారం రెండో రోజు జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలకు 1,275 నామినేషన్లు దాఖలు చేశారు. జెడ్పీ కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులు, మద్దతుదారులతో కిక్కిరిసిపోయింది. అధికారులు రాత్రి 7 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. జెడ్పీటీసీలకు సంబంధించి 115 నామినేషన్లు, ఎంపీటీసీలకు సంబంధించి 1160 నామినేషన్లు దాఖలు చేశారు.
జెడ్పీటీసీ నామినేషన్లు..
జెడ్పీటీసీలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ తరఫున 50, టీడీపీ 46, బీజేపీ 4, బీఎస్పీ 8, కాంగ్రెస్ 3, జేఎస్‌పీ 2, స్వతంత్ర అభ్యర్థులుగా 2 నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజులకు సంబంధించి 35 జెడ్పీటీసీ స్థానాలకు 127 నామినేషన్లు దాఖలు చేశారు.
ఎంపీటీసీ నామినేషన్లు
జిల్లా వ్యాప్తంగా 440 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రెండో రోజు వైఎస్సార్‌సీపీ నుంచి 494 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ 540, సీపీఎం 20, బీజేపీ 24, బీఎస్పీ 4, కాంగ్రెస్ 9, జెఎస్‌పీ 28, స్వతంత్రులు 41 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజులకు సంబంధించి 1533 నామినేషన్లు వేశారు.
రెండో రోజు జెడ్పీటీసీలకు 115,
ఎంపీటీసీలకు 1160 నామినేషన్లు
అభ్యర్థులతో కిక్కిరిసిన జెడ్పీ కార్యాలయం
రాత్రి 7 గంటల వరకు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ


