దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

దాష్టీకం

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

చిట్టమూరు: మండలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పచ్చమూకలు అడ్డుకున్నాయి. బయటి ప్రాంతాల నుంచి రౌడీలను తెచ్చి వారికి మద్యాన్ని అందజేసి దాడులకు ఉసిగొల్పారు. రోడ్డుకు అడ్డంగా నిలబడి కర్రలతో హల్‌చల్‌ చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను హతమారుస్తామంటూ భయాందోళనలకు గురిచేశారు. పార్టీ మండలాధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, కామిరెడ్డి కస్తూర్‌రెడ్డి, చెన్నారెడ్డి బాబురెడ్డి, కోదండరామిరెడ్డి, 12 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నేతలతో కలసి కొత్తగుంటకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకున్నారు. అక్కడ్నుంచి చిట్టమూరులోని నామినేషన్‌ కేంద్రానికి కాలినడకన బయల్దేరారు. ఈ తరుణంలో టీడీపీ నేతలు, వారు తీసుకొచ్చిన గుండాలు కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పార్టీ నేతలను ఆపేందుకు వాకాడు సీఐ హుస్సేన్‌బాషా, చిట్టమూరు ఎస్సై నాగరాజు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇరువర్గాలతో చర్చలు జరిపే క్రమంలో నామినేషన్‌ సమయం దాటిపోతోందని, తమను లోపలికి పంపాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కోరారు. వాకాడు సీఐ దగ్గరుండి యాకసిరి ఎంపీటీసీ అభ్యర్థి సిద్ధపురెడ్డి పోలమ్మను తీసుకెళ్లి నామినేషన్‌ వేయించారు. మిగిలిన వారు శుక్రవారం ఉదయం 10.30కు వస్తే వారితో కూడా దాఖలు చేయిస్తామని పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement