పరిషత్‌ పోరుకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ పోరుకు నోటిఫికేషన్‌

Oct 20 2026 4:37 AM | Updated on Oct 20 2026 4:37 AM

● రేపట్నుంచి 23 వరకు

నామినేషన్ల స్వీకరణ

● 24న పరిశీలన.. 27 వరకు ఉపసంహరణకు అవకాశం

● నవంబర్‌ మూడున పోలింగ్‌.. ఐదున కౌంటింగ్‌

నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం విడుదల చేసింది. బుధవారం నుంచి 23 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 24న పరిశీలన.. 27వ తేదీ మధ్యాహ్నం మూడు వరకు ఉపసంహరణకు అవకాశముంటుంది. నవంబర్‌ మూడున పోలింగ్‌.. ఐదున కౌంటింగ్‌ను నిర్వహించనున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఇలా..

జిల్లాలోని 35 మండలాల్లో 35 జెడ్పీటీసీలు, 440 ఎంపీటీసీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. జిల్లాలో 12,85,840 మంది ఓటర్లుండగా, 1665 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఇందులో 545ను సమస్యాత్మక, క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా నిర్ధారించారు.

గ్రామాల్లో సందడి

నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఎక్కడ చూసినా. ఎలక్షన్లపైనే చర్చించుకుంటున్నారు. పోటీ చేయాలనుకునే వారు ఇంటింటికీ తిరిగి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రచ్చబండలు రాజకీయ చర్చలకు వేదికలవుతున్నాయి.

జెడ్పీలో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు

నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీలకు సంబంధించిన నామినేషన్లను జెడ్పీ కార్యాలయంలో స్వీకరించనున్నారు. దీనికి గానూ నాలుగు డివిజన్ల డీఎల్డీఓలను నియమించి.. నాలుగు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. పత్రాల పరిశీలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఎంపీటీసీలకు సంబంధించి ఆయా మండల కేంద్రాల్లో ఆర్వోలు స్వీకరించనున్నారు. నామినేషన్లపై ఏమైనా అభ్యంతరాలుంటే జెడ్పీటీసీ అభ్యర్థులు కలెక్టర్‌కు.. ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీఓలకు 25న ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలను మరుసటి రోజున పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement