టీడీపీకి తొత్తులుగా ఆర్వోలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి తొత్తులుగా ఆర్వోలు

Oct 20 2026 4:37 AM | Updated on Oct 20 2026 4:37 AM

నెల్లూరు రూరల్‌: నామినేషన్‌ పత్రాల పరిశీలనలో రిటర్నింగ్‌ ఆఫీసర్లు టీడీపీకి తొత్తులుగా మారి ఏకగ్రీవాలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు మేయర్‌ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను సోమవారం కలిసి సమస్యను వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కూటమి నేతలకు అతి ముఖ్యులుగా ఉంటారో అక్కడ అధికారులను పెట్టి ఏకగ్రీవాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉదయం సమర్పించిన జాబితాలో అన్నీ ఉన్నా, సాయంత్రానికి ఏదో ఒక సర్టిఫికెట్‌ను మిస్‌ చేసి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement