● వ్యక్తి మృతి
మర్రిపాడు: కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన ఘటన నెల్లూరు– ముంబై జాతీయ రహదారిపై కండ్రిక– నందవరం మధ్య గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మర్రిపాడు మండలం తిమ్మాయపాళేనికి చెందిన వెంగయ్య(48) నెల్లూరులో నివాసం ఉంటూ కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో ఆయన డబ్బుల విషయమై సొంతూరికి వచ్చి తిరిగి వెళ్తుండగా కండ్రిక– నందవరం మధ్య కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ క్రమంలో కారులోనే వెంగయ్య మరణించారు. సమాచారం అందుకున్న ఎస్సై బలరాంరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాములు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


