పొదుపు సంఘాలకు రూ.600 కోట్ల రుణాలు | - | Sakshi
Sakshi News home page

పొదుపు సంఘాలకు రూ.600 కోట్ల రుణాలు

Sep 2 2026 12:00 AM | Updated on Sep 2 2026 12:00 AM

డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి

సంగం: ‘2026 – 27 ఆర్థిక సంవత్సరానికి పొదుపు సంఘాలకు బ్యాంక్‌ల ద్వారా రూ.1,600 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటివరకు సుమారు రూ.600 కోట్ల మేర రుణాలు అందించాం’ అని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. సంగం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో పొదుపు సంఘాల పనితీరు, రుణాల మంజూరు, రికవరీ తదితర అంశాలపై వీఓఏలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీ్త్రనిధి కింద రూ.11 కోట్ల లక్ష్యానికి గానూ ఇప్పటికే రూ.6 కోట్ల మేర రుణాలు అందించామన్నారు. ఉన్నతి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జీవనోపాధుల కల్పన కోసం రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.2 కోట్ల మేర అందించినట్లు పేర్కొన్నారు. సీఐఎఫ్‌ కింద రూ.17 కోట్ల లక్ష్యానికి గానూ రూ.16 కోట్లను సభ్యులకు అందించినట్లు వివరించారు. జిల్లాలో అన్ని పథకాల కింద పొదుపు సంఘాల సభ్యులకు అందించిన రుణాల రికవరీ 96 శాతానికి పైగా ఉందని తెలిపారు. వివిధ యాప్‌ల వినియోగంలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. అలాగే పొదుపు సంఘాల సభ్యులు జీవనోపాధి కోసం వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అవసరమైన శిక్షణను మండల కేంద్రాల్లోనే అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం మధుసూదన్‌రావు, ఏపీఎం రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement