సమయపాలనను పాటించాల్సిందే | - | Sakshi
Sakshi News home page

సమయపాలనను పాటించాల్సిందే

Sep 2 2026 12:00 AM | Updated on Sep 2 2026 12:00 AM

పొదలకూరు: సచివాలయ ఉద్యోగులు సమయపాలనను పాటించి సర్టిఫికెట్ల కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పొదలకూరు బిట్‌ – 3, 4 సచివాలయాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. బిట్‌ – 4 సచివాలయంలో విధులకు డిజిటల్‌ అసిస్టెంట్‌ సక్ర మంగా హాజరుకావడం లేదనే ఫిర్యాదులందాయని, షోకాజ్‌ నోటీస్‌ను జారీ చేయాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించారు. నెలకెన్ని సర్టిఫికెట్లను అందజేస్తున్నారనే వివరాలను ఆరాతీశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికెళ్లి అక్కడి సిబ్బందితో మా ట్లాడారు. రీ సర్వే తదితర అంశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ నరసింహరావు, తహసీల్దార్‌ శివకృష్ణయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement