డీసీపల్లిలో 616 పొగాకు బేళ్ల విక్రయం | - | Sakshi
Sakshi News home page

డీసీపల్లిలో 616 పొగాకు బేళ్ల విక్రయం

Sep 2 2026 12:00 AM | Updated on Sep 2 2026 12:00 AM

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం 616 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. వేలానికి 824 బేళ్లు రాగా వాటిలో 616 బేళ్లను విక్రయించామని, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలియజేశారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.250 కాగా కనిష్ట ధర రూ.110 లభించింది. మొత్తమ్మీద సగటు ధర రూ.187.90 గా నమోదైంది. వేలంలో పది కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

కిలో పొగాకు ధర రూ.161

కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు సరాసరి ధర రూ.161.36 లభించింది. జనరల్‌ క్లస్టర్‌కు చెందిన రైతులు 1,012 పొగాకు బేళ్లను తీసుకురాగా 798 బేళ్లను కొనుగోలు చేయగా 214 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వేలం నిర్వహణాధికారి రాజశేఖర్‌ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.250 పలకగా, కనిష్ట ధర రూ.110 వచ్చిందన్నారు. వేలంలో 11 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement