పెండింగ్‌ బకాయిలు తక్షణమే చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బకాయిలు తక్షణమే చెల్లించాలి

Sep 1 2026 12:19 AM | Updated on Sep 1 2026 12:19 AM

జేఏసీ జిల్లా చైర్మన్‌

బండారుపల్లి వెంకటేశ్వర్లు

నెల్లూరు(అర్బన్‌): ఉద్యోగులకు ప్రభుత్వం పెండింగ్‌ బకాయిలు తక్షణమే చెల్లించాలని జిల్లా జేఏసీ చైర్మన్‌ బండారుపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సోమవారం నెల్లూరు దర్గామిట్టలోని ఎన్జీఓ భవన్‌లో వివిధ సంఘాలతో కలిసి జేఏసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 5 డీఏలను, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ బకాయిలను విడుదల చేసి పీఆర్సీ కమిషన్‌ను నియమించాలన్నారు. ఉద్యోగులకు న్యాయం జరగకపోతే ఈనెల 5న జరిగే రాష్ట్ర జేఏసీ సమావేశంలో తీసుకునే ఉద్యమ నిర్ణయాలకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ సురేంద్రరెడ్డి, చలపతి శర్మ (యూటీఎఫ్‌), మురళీకృష్ణారెడ్డి (ఆర్టీసీ – ఎన్‌ఎంయూ), సుదర్శన్‌ (ఎస్టీయూ) తదితర పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement